- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్స్ పరీక్షలపై ఉచిత శిక్షణ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, పాలమూరు : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న గ్రూపు పరీక్షలకు హాజరుకానున్న మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులకు 'శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో గల 'ఎక్స్ పో ప్లాజా'లో ప్రత్యక్షంగా వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
పేరు, తండ్రి పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, కులము, పుట్టిన తేదీ, విద్యార్హతలు తదితర వివరాలతో ఈ నెల 29వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారి పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. స్వయంగా హాజరై నమోదు చేసుకోలేని వారు https://forms.gle/Wbx7sYAH3YWJEgpH7 లింక్ ద్వారా, 9912289919 లేదా 9502797957 ఫోన్ నంబర్ల ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. ఉచిత కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన అనంతరం కోచింగ్‌కు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. స్క్రీనింగ్ పరీక్ష తేదీ వివరాలను తర్వాత తెలియజేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.