నిరుద్యోగులకు శుభవార్త

by S Gopi |
నిరుద్యోగులకు శుభవార్త
X

దిశ, మిర్యాలగూడ: ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత క్లాసులు, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ అన్నారు. శనివారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ లు ప్రకటించనున్న తరుణంలో నిరుద్యోగ యువత సౌకర్యార్థం ఉచితంగా క్లాసులు, శిక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నిపుణులైన అధ్యాపకులచే ఉచిత బోధనతోపాటు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్1 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి సమాచారం, వివరాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story