దివ్యాంగులకు ఉచిత బస్సు పాసు మేళా

by Javid Pasha |   ( Updated:2022-03-11 06:10:11.0  )
దివ్యాంగులకు ఉచిత బస్సు పాసు మేళా
X

దిశ, కల్లూరు: అర్హులైన దివ్యాంగులకు శనివారం ఉదయం 9.30 గంటలకు కల్లూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉచిత బస్సు పాసు మేళా నిర్వహించనున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ డి. శ్రీహర్ష తెలిపారు. అదేవిధంగా నిత్యం బస్సులతో ప్రయాణించే ప్రయాణికులు నెలవారి సీజన్ టికెట్‌లు తీసుకోవాలని 20 రోజులు చార్జీతో 30 రోజులపాటు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఈ సీజన్ టికెట్‌తో ప్రయాణించ వచ్చునని అన్నారు. కల్లూరు మండల పరిధిలోని అర్హులైన దివ్యాంగుల అందరికీ కల్లూరు ఎంపిపి బీరవల్లి రఘు సౌజన్యంతో ఉచిత బస్ పాసులు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటో తీసుకుని కల్లూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణకు రావాలని ఆయన కోరారు. మండల పరిధిలోని దివ్యాంగుల అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Advertisement

Next Story