- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వివాదాలే మాజీ ఎంపీటీసీ హత్యకు కారణం అయ్యాయా..?
దిశ, మక్తల్: నారాయణ పేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి మాజీ ఎంపీటీసీ మహమ్మద్ మునాఫ్ హత్య ఘటన కలకలం రేపింది. దీనితో గ్రామ వ్యాప్తంగా ఈ హత్యపైనే చర్చ నడుస్తోంది. కృష్ణ మండల కేంద్రంలో జరిగే ప్రతి విషయంలో మునాఫ్ జోక్యం చేసుకోవడం.. తన అనుచరుడికి పోటీగా మరో వ్యక్తి చేత చికెన్ దుకాణం పెట్టించడంతో అనుచరుడు మునాఫ్‌ఫై కక్ష పెంచుకున్నాడు. అంతే కాకుండా మునాఫ్‌తో పొలం వివాదం ఉన్న వ్యక్తులు కూడా ఇతడి అనుచరుడికి తోడై చివరికి మునాఫ్‌ను హత్యను చేయడానికి దారి తీసిందని గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే మునాఫ్ తల్లి ఉంటే సంఘటన జరిగేది కాదని.. కొడుకునే ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తలు చెపుతుండేదని గ్రామస్తులు అనుకుంటున్నారు. మునాఫ్ వల్ల నష్టపోయిన వ్యక్తి కక్ష్య పెంచుకోవడం వల్లే ఈ హత్య జరిగిందని సమాచారం.
అంతే కాకుండా.. బస్టాండు దగ్గర ఉన్న వివాదాస్పదమైన స్థలము.. మఠానికి చెందిన వ్యవసాయ పొలం విషయం.. మట్కాజూదంలో ఎవరిని ఎదగనివ్వక పోవడం.. గ్రామంలో ఓ వర్గానికి తల నొప్పిగా మారడంతో ఈ హత్యకు దారితీసిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ హత్య చేసిన నిందితులకు నేరచరిత్ర లేదని.. డబ్బు, డ్రగ్స్‌కు బానిసలై ఈ హత్య చేసినట్లు గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. ఈ విషయం మునాఫ్‌కు ముందే తెలిసిన నిర్లక్ష్యం చేసాడని అనుకుంటున్నారు గ్రామస్తులు. మునాఫ్ తల్లి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని కొందరు చర్చించుకుంటున్నారు. ప్రశాంతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న కృష్ణ గ్రామంలో ఈ సంఘటన జరగడంతో జనం ఉలిక్కిపడ్డారు. ఈ కేసును ఛేదించేందుకు మక్తల్ సీఐ సీతయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని రెండు మూడు రోజుల్లో కేసుని ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.