- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ డ్రామాలు: ఏలేటి మహేశ్వర రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అంబేద్కర్ రాసిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ వద్దంటున్నారని.. ఆయన రాచరికం కోరుకుంటున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన నిర్మల్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఒకరు రాజ్యాంగం బాగాలేదంటారని.. మరొకరు తెలంగాణ ఇవ్వడం కరెక్ట్ కాదంటారని.. ఇలా ఇష్యూ ను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఎవరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరో కొత్త పథకాలతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పన్నుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మోడీ, కెసీఆర్ ల పాలనపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పటికే 30 లక్షలు దాంటిదని చెప్పారు, జనమంతా కాంగ్రెస్ వైపే వున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. మార్చి 31 నాటికి నిర్మల్ లో 75వేల సభ్యత్వాలు నమోదు చేస్తామన్నారు.