వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ అమలు చేయాలి: చింత ప్రభాకర్

by Manoj |
వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ అమలు చేయాలి: చింత ప్రభాకర్
X

దిశ, సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు పంజాబ్ కు ఒక నీతి తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతి ప్రదర్శిస్తూ నిర్లక్ష్యం చేస్తోందని వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ టాక్స్ పేరిట టాక్సులు వసూలు చేస్తుందని.. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకు సూచించి పంటలు పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. అబద్ధాలు ప్రచారం చేసి రైతులను మోసం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 14వ తేదీన నిర్వహించే యాత్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు దేశంలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. రైతు ప్రభుత్వమైనా టీఆర్ఎస్ పార్టీ రైతుల ధాన్యాన్ని ప్రతిబింబాలను కొనుగోలు చేయాలని కోరుతూ గత వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి చీమైన కుట్టినట్టుగా లేదని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే అని, అందుకోసం ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, సి డి సి మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల నర్సింలు, యువ నాయకులు శ్రావణ్ రెడ్డి, జలంధర్ రావు, వాజిద్ , సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ మోహన్ నాయక్ , కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, విష్ణు, ప్రదీప్, జీవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed