- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > Telugu News > ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: మాజీ మంత్రి సోమిరెడ్డి
ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: మాజీ మంత్రి సోమిరెడ్డి
by Vinod kumar |
X
దిశ, ఏపీ బ్యూరో: రైతులు ధాన్యం అమ్ముకోలేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లలో ఫిడేలు వాయించుకుంటున్నారా? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలో ముప్పై శాతం కూడా కొనుగోళ్లు జరగడం లేదని, ఆరు నెలలు గడిచినా రైతులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ఒక్క పంటలో కోటి టన్నులు సేకరించారని, కేసీఆర్ మగాడని సోమిరెడ్డి రెడ్డి కొనియాడారు.
నెల్లూరు కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం రైతుల మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యలు చేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story