మీ సలహాలతోనే ముందుకెళ్తా.. జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు

by GSrikanth |
మీ సలహాలతోనే ముందుకెళ్తా.. జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత జూపల్లి కృష్ణారావు శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా జనాల్ని కలుస్తూ.. తన రాజకీయ జీవితంపై అభిప్రాయాలు సేకరించారు. అంతకముందు.. జూపల్లి పార్టీ మారుతున్న విషయం తెలిసి ఉదయం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన తన అనుచరగణంతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ''మీ సలహాలు.. సూచనలు.. నిర్ణయాలతోనే రాజకీయపరంగా అడుగు వేస్తాను.'' అని కార్యకర్తలతో జూపల్లి ప్రకటించారు.

కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన పార్టీ మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరబోతున్నారమూ ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అనుచర వర్గం ఒత్తిడి తేవడంతో గత నాలుగైదు రోజుల నుండి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని ఆయా మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో విస్తృత సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story