- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
The Great Pre Wedding Show: తిరువీర్ హీరోగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ స్టార్ట్.. హీరోయిన్ ఎవరంటే?
దిశ, సినిమా: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో వెర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు తిరువీర్ (Thiruveer). ఇప్పుడు ఈయన నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre Wedding Show) హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బై 7పి.ఎంప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై అష్మితా రెడ్డి నిర్మిస్తున్నా ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ (Rahul Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే.. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ముహూర్తం సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగరం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ (Rahul Srinivas) మాట్లాడుతూ.. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కామెడీ డ్రామా మూవీగా అలరించనుంది. నవంబర్ 7 నుంచి ఎస్.కోట, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపబోతున్నాం. అవకాశం ఇచ్చిన హీరో తిరువీర్‌కి, నిర్మాతలు సందీప్ అగరం, అష్మితారెడ్డికి ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాతలు సందీప్ అగరం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాను కామెడీ డ్రామా జోనర్‌లో రూపొందిస్తున్నాం. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం’’ అన్నారు. కాగా.. ఇందులో రోహన్ రాయ్, నరేంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.