- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జా కోరల్లో ఫుట్‌పాత్‌లు.. జాతీయ రహదారి విస్తరణలో జాప్యం!
దిశ, కల్వకుర్తి: వాణిజ్య వ్యాపార కేంద్రాలకు నిలయం కల్వకుర్తి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. బస్ స్టేషన్ కు అనుసందానమైన రోడ్డు ప్రాంతాలలో అన్ని రకాల సామగ్రి కోసం వేల మంది వినియోగదారులు, విద్యార్థులు, వ్యాపారాలు వివిధ వాటికోసం రోజు వస్తూ పోతూ ఉంటారు. అలాంటి ఈ ప్రాంతంలో వాహనదారులు వాహనాలను నిలపలేని పరిస్థితి, పాదాచారులు నడవలేని దుస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం జడ్చర్ల నుండి కోదాడ వరకు వేసిన జాతీయ రహదారి కల్వకుర్తి పట్టణంలో రోడ్డు విస్తరణలో జాప్యం చేయడంతో దుకాణ యజమానులు వారి వ్యాపారం కోసం ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్నారు. దీంతో పాదాచారులు నడవలేని దుస్థితి నెలకొంది.
విస్తరణలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా పాదాచారులు కోసం అధికారులు ఫుట్ పాత్ లు నిర్మించారు. స్థానికంగా పలుకుబడి ఉన్న కొంత మంది దుఖానదారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో రోడ్డు విస్తరణలో తమ దుఖానాలు తొలగించకుండా సంబంధిత శాఖ అధికారులకు మూటలు ముట్ట చెప్పడంతో కొలతలు తక్కువ చేసి రోడ్డు వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రోడ్డు జాప్యం ద్వార రోడ్డు వెడల్పు తక్కువ కావడంతో గ్రిల్స్ వేసి దుఖానాలకు అనుసరించి ఫుట్ పాత్ లను నిర్మించడం వల్ల పాదచారులకు నడవడం కష్టమైంది.
ఆక్రమణలకు గురైన..
ఆల్ఫా హోటల్ వరకు, ఆల్ఫా హోటల్ కార్యాలయం వరకు ఫూట్ పాత్ లపై వస్త్ర వ్యాపారాలు, తినుబండారాలు, టి బండ్లు, బైక్ మరమ్మత్తుల కోసమై వినియోగించడం, సిమెంట్ ఇటుకల వ్యాపారాలు, ఇంటి నిర్మాణ కోసమై వినియోగించే ఇసుకను ఫుట్ పాత్ పై పోయడం, జాతీయ రహదారిపై ఇసుక కుప్పలు, దుఖానాల బోర్డులను సైతం ఫుట్ పాత్ పై పెట్టడం వల్ల పాదాచారులు, ట్రాక్టర్ల పరికరాలు, వడ్రంగి పనులు, వెల్డింగ్ వర్క్స్, ఇలా ఒకటేంటి వివిధ రకాల పనులతో పుట్ పాత్ లను కబ్జా చేయడంతో పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పుట్ పాత్ సమస్య తీరేదెలా..
రహదారులను, పుట్ పాత్ లను ఆక్రమించిన దుకాణాలు, ఫ్లెక్సీలు, తోపుడు బండ్లను వెంటనే తొలగించాలి. రోడ్డుకిరువైపులా పుట్ పాత్ లపై అనధికారంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై జరిమానా విధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో అధికారులు సీరియస్‌గా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దాలి. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన పుట్ పాత్ లను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖది. లేకపోతే పుట్ పాత్ లు, రహదారులు మరింతగా ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం తగదు. వారే సీరియస్‌గా వ్యవహరించి చర్యలు తీసుకోవాలి. లేదంటే రేపు జరగబోయే ప్రమాద పరిణామాలకు పూర్తి బాధ్యత అధికారులే వహించాల్సి ఉంటుంది.
పురపాలక అధికారి మాట ఇచ్చే..
కల్వకుర్తి పట్టణంలోని పుట్ పాత్ లు ఆక్రమణలకు గురయ్యాయని ఫిబ్రవరి 16 వ తేదీన స్థానిక మున్సిపల్ కార్యాలయానికి 'దిశ' ప్రతినిధి వెళ్లి వివరణ కోరగా.. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పుట్ పాత్ లను వ్యాపారస్తులు ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ముందస్తుగా తమ మున్సిపల్ సిబ్బందితో దుఖనాదారులకు నోటీసులు అందజేస్తామని, నోటీసులు పట్టించుకోకుండా పుట్ పాత్ లపై అలాగే వ్యాపారాలు కొనసాగిస్తే ఫిబ్రవరి 26న పురపాలక సిబ్బందితో ఖాళీ చేయించి వారికి జరిమానా విధిస్తామని పత్రిక, టీవీ ముఖంగా సమాధానమిచ్చారు.
తర్వాత చేతులెత్తేసే..
గడువు ముగిసిన కూడా నోటీసులు జారీ చేయలేదు కదా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ప్రజల ఆస్తులు దుర్వినియోగం అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల వద్ద పన్నులు వసూలు చేసే సత్తా ఉన్న అధికారులు ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత పట్ల అలసత్వం వహిస్తున్నారు. ప్రజల అస్తులనే కాదు ప్రాణాలను కాపాడే బాధ్యత కూడా అధికారులపై ఉన్న సంగతి మరిచారు.
సత్వరమే చర్యలు తీసుకోవాలి..
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించి ప్రజల ప్రాణ నష్టం వాటిల్లక ముందే సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కల్వకుర్తి పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.