- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తగ్గుతున్న ధరలతో డిమాండ్ రికవరీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు!
న్యూఢిల్లీ: వివిధ వస్తువుల ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దేశవ్యాప్తంగా డిమాండ్ పుంజుకుంటుందని, పెరుగుతున్న ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉంటాయని ఎఫ్ఎంసీజీ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. దేశీయ ప్రముఖ పార్లె ప్రోడక్ట్స్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, డాబర్‌తో సహా ప్రధాన ఎఫ్ఎంసీజీ కంపెనీలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాయి. అంతేకాకుండా వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్ సమయంలో మెరుగైన మార్జిన్‌కు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత వస్తువుల ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
కొన్ని వస్తువులలో గరిష్ఠ స్థాయి నుంచి 15-20 శాతం తగ్గిందని పార్లే ప్రోడక్ట్స్ ఉత్పత్తుల విభాగం హెడ్ మయాంక్ షా అన్నారు. అధిక ద్రవ్యోల్బణ వల్ల మార్జిన్ ఒత్తిడిని ఎదుర్కొంటున్న కంపెనీలకు ధరలు దిగి రావడం కొంత ఊరటనిచ్చింది. దీనివల్ల చాలా కంపెనీలు ధరల పెంపును తగ్గించాయి. తదుపరి పెంపు విషయంలో లేదా ప్యాకేజీ పరిమాణం తగ్గింపుపై పునరాలోచిస్తాయని మయాంక్ తెలిపారు. గత కొద్దిరోజులుగా వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ గతేడాదితో పోలిస్తే ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కానీ, తదుపరి ధరల పెంపు ఉండదని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఆందోళనల నుంచి బయటపడుతున్న తరుణంలో పట్టణ, గ్రామీణ డిమాండ్ పెరిగేందుకు ఈ సానుకూల పరిణామాలు కలిసొస్తాయని ఆయన వెల్లడించారు.