‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

by sudharani |
‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: రాహుల్ విజయ్ (Rahul Vijay), నేహా పాండే (Neha Pandey) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ (Khel Khatam Darwaja Bandh). డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్‌పై అర్జున్ దాస్యన్ (Arjun Dasyan) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ తమ ప్రొడక్షన్ నెం.4గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్, టైటిల్‌ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి (Rana Daggubati) లాంఛ్ చేశారు. టైటిల్ (Title) ఇంట్రెస్టింగ్‌గా ఉండి ఆకట్టుకుందన్న రానా.. మూవీ టీమ్‌కు బెస్ట్ విశెస్ అందించారు. అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed