- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సిద్దిపేటలో మరోసారి కాల్పుల కలకలం.. ఆ వివాదాలే కారణం!
by Nagaya |

X
దిశ, డైనమిక్ బ్యూరో : భూ వివాదాల నేపథ్యంలో కాల్పులు జరిపిన ఘటన సిద్ధిపేటలో జరిగింది. ఇప్పటికే జనవరి 31న రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కాల్పులు జరిపి దోపిడీ చేసిన విషయం తెలిసిందే. అది మరువక ముందే మరో సారి కాల్పుల జరిపిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా.. గజ్వేల్ లో ఒగ్గు తిరుపతి, వంశీ అనే ఇద్దరి మధ్య నెలకొన్న భూ వివాదం కాల్పులు జరిపేంత వరకు దారి తీసింది. చెల్లాపూర్‌కు చెందిన తిరుపతికి చెందిన వ్యక్తులే వంశీపై కాల్పులు జరిపినట్లు సమాచారం. గతంలోనూ భూతగాదాల విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా చందాపూర్ శివారులో కాల్పులు జరిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story