ఫ్యాన్లు పరిశ్రమలో షాట్​ సర్య్కూట్.. భారీగా ఎగసి పడ్డ మంటలు

by Manoj |
ఫ్యాన్లు పరిశ్రమలో షాట్​ సర్య్కూట్.. భారీగా ఎగసి పడ్డ మంటలు
X

దిశ, కూకట్​పల్లి : బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధి రంగారెడ్డినగర్​ పారిశ్రామిక వాడలోని ఫ్యాన్లు తయారు చేసే పరిశ్రమంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి నగర్​ పారిశ్రామిక వాడలోని యశ్​ ఫ్యాన్ల కంపెనీలో వెల్డింగ్​ చేస్తుండగా ఏసీలో షాట్​ సర్య్కూట్​ చోటు చేసుకుని అగ్ని ప్రమాదం సంభవించిందని పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. ఈ క్రమంలో అప్రమత్తమైన కార్మికులు పరిశ్రమ నుంచి బయటికి పరుగులు తీశారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని బాలానగర్​ పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిశ్రమ యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందలేదని, ఆస్తి నష్టం గురించి ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed