- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను ఎక్కడివాడినో మీరే చెప్పండి.. ట్రోల్స్‌పై కబీర్‌ఖాన్ సీరియస్
దిశ, సినిమా : పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ తనను ట్రోల్ చేయడం పట్ల బాలీవుడ్ దర్శకుడు కబీర్‌ఖాన్ స్పందించాడు. ఇదే క్రమంలో సినిమాల్లో దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడుతూ ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉందని తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది కావాలనే తనపై విష ప్రచారం చేస్తున్నారని, పేరు చివరన 'ఖాన్' ఉండటమే ఇందుకు కారణమని చెప్పాడు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఒక భారతీయుడిగా ఎంతో బాధపడతానన్న కబీర్ ఖాన్.. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ ఉంటుంది కానీ, ఇక్కడ విషపూరిత వాదనలే ఎక్కువగా ఉన్నట్లు గ్రహించానని పేర్కొన్నాడు.
ఇక తనను పాక్ వెళ్లిపోమంటూ వాదిస్తున్న వాళ్లను ఉద్దేశిస్తూ.. 'నేను ఒకసారి పాకిస్తాన్‌కు వెళ్లాను. అక్కడున్న లష్కర్(ఉగ్రవాద సంస్థ)లు భారతదేశానికి తిరిగి వెళ్లమని చెప్పారు. కానీ నేను అన్ని రకాల ఎమోషన్లు రేకెత్తించే కథలు చూపిస్తే.. ఇక్కడ, అక్కడ ఓకే అన్నారు. ఇప్పుడు ఎక్కడివాడిని కాదంటున్నారు' అంటూ తనదైన స్టైల్‌లో కౌంటర్ వేశాడు. ఈ క్రమంలోనే దేశభక్తి, జాతీయత గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి దర్శకుడు, నిర్మాతకు సొంత అభిప్రాయాలు ఉండాలన్న ఆయన తాను ఇటీవల తెరకెక్కించిన '83'చిత్రాన్ని ఉదాహరణగా చూపాడు. మన జాతీయవాదానికి కౌంటర్ పాయింట్ విలన్ కావాలి. కానీ దేశభక్తికి అలాంటిదేమీ అవసరం లేదన్నాడు. చివరగా నేడు దేశభక్తికి, జాతీయవాదానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని గ్రహించాలన్నాడు.