- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Canada: తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోంది- జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని బ్రాంప్టన్‌లో (Brampton) హిందూ దేవాలయంలో భక్తులపై జరిగిన దాడిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(EAM Jaishankar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని కెనడా(Canada) ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో(Australia) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తాన్ తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై దాడి చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. కెనడా ప్రభుత్వం అక్రమంగా భారతీయ దౌత్యవేత్తలను నిఘాలో ఉంచింది. ట్రుడో సర్కార్ భారత్‌పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంది. ఇది ఆమోదయోగ్యం కాని విషయం. కెనడా తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని భావిస్తున్నా. బ్రాంప్టన్ లో జరిగిన దాడి ఘటన భారత్‌కు ఆందోళన కలిగించింది’’ అని అన్నారు. ఇకపోతే, జైశంకర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. నవంబర్ 7 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.
దాడిని ఖండించిన మోడీ
కెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత దౌత్యవేత్తలను బెదిరించే హేయమైన ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో చర్యలకు ఉపక్రమించారు. ఖలిస్థానీలకు అనుకూలంగా, భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు.