- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పనుల వల్ల మా పంటలు ఎండుతున్నాయి: రైతులు
దిశ, స్టేషన్ ఘన్ పూర్: మీ పనుల వల్ల మా పంటలు ఎండుతున్నాయని, పనులు వెంటనే ఆపాలని రైతులు కోరారు. అయితే సదురు కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనల మేరకే పనులు సాగుతున్నాయని, పనులు ఆపేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో రైతులు, కాంట్రాక్టర్ మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామంలో మల్లన్న గండి రిజర్వాయర్ కుడి కాలువ నుండి తాటికొండ శివారు వల్లభ రాయలచెరువు సాగునీరు అందించే కాల్వ ఆధునీకరణ పనులు సంబంధిత శాఖ ఆదేశాల మేరకు పట్టినట్టు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఆధునీకరణ పన్నుల పేరుతో పాతకాలువ పూడ్చి కొత్త కాలువ నిర్మించడం వల్ల పంటలు ఎండుతున్నాయి. దీంతో పలువురు రైతులు పనులు జరిగే చోట జెడ్పీటీసీ రవి, మండల వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డిలతో కలిసి పనులు ఆపాలని నిరసన తెలిపారు. ఈ క్రమం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. సంబంధిత శాఖ ఈఈ శశిభూషణ్ వాస్తవాలు వెల్లడించకపోవడంతో ఇరువర్గాల ఘర్షణకు ఆజ్యం పోసినట్లయింది. ఏం జరుగుతుందో చూడాలి.