- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటి మోటార్ వైర్లు సర్దుతుండగా.. షాక్ కొట్టి రైతు మృతి
దిశ, వర్గల్: పొలం వద్ద కరెంటు వైర్లు సరి చేస్తుండగా విద్యుత్ షాక్ తాకడంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వర్గల్ మండలంలోని నాచారం గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం గ్రామానికి చెందిన సంగెం నర్సింహులు (46) తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె తో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. బోరు మోటరు మరమ్మత్తులలో భాగంగా స్టార్టర్ పీజులు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోవడంతో చరవాణిలో సంప్రదించగా సమాచారం లభ్యం కాలేదు. దీంతో భార్య లక్ష్మి పొలం వద్దకు వెళ్లి చూడగా బురదలో విద్యుత్ షాక్ తగిలి చనిపోయి ఉన్నాడు. విషయం కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారంతో పోలీసులకు సమాచారం రాగా మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుని భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యుత్ షాక్ తో తన భర్త మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.