నేను బతికే ఉన్నాను.. ఏ ప్రమాదంలో చనిపోలేదంటున్న నటుడు

by Manoj |
నేను బతికే ఉన్నాను.. ఏ ప్రమాదంలో చనిపోలేదంటున్న నటుడు
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఫర్దీన్‌ ఖాన్‌ తన జీవితంలో ఎదురైన రెండు చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రెండు సందర్భాల్లో తాను ఊహించని తప్పుడు వార్తలు మానసికంగా వేదనకు గురచేశాయంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు ఆ ఫేక్ న్యూస్ తనతోపాటు ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేశాయన్న ఫర్దీన్.. కొన్నేళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నందుకు యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు రెండు సార్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ న్యూస్ విన్న తన తల్లి గుండెపోటు వచ్చే ప్రమాదం నుంచి బయటపడిందని, భార్య కూడా ఎలా షాక్ అయ్యిందో మాటల్లో చెప్పలేనని అన్నాడు. అలాగే సమాజంలో కొంతమంది ఇంత బాధ్యతరాహిత్యంగా ఎలా జీవిస్తారని, అలాంటి వాళ్లకు కుటుంబం, ప్రేమలు ఉండవా అంటూ ప్రశ్నించాడు. ఇక 2010లో 'దుల్హా మిల్‌గయా'లో కనిపించిన ఫర్దీన్ 14 ఏళ్ల తర్వాత ప్రస్తుతం 'విస్ఫోట్‌' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Advertisement

Next Story