బంపర్ ఆఫర్ ఇచ్చిన అభిమాని.. పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో?

by Javid Pasha |   ( Updated:2022-03-11 02:46:37.0  )
బంపర్ ఆఫర్ ఇచ్చిన అభిమాని.. పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోలకు సాధారణంగా నిర్మాతలు బహుమతులు ఇస్తుంటారు. చేసిన సినిమా బంపర్ హిట్ అయితే హీరోకి బహుమతి పక్కా. అయితే తాజాగా బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తిక్ ఆర్యన్‌కి ఓ ఫ్యాన్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల కార్తిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోకు అనేక కామెంట్లు వచ్చాయి. అందులోనే ఓ వీరాభిమాని తనను పెళ్లి చేసుకుంటే కార్తిక్ ఆర్యన్‌కు రూ.20 కోట్లు ఇస్తానని కామెంట్ చేసింది. దీనికి కార్తీక్ స్పందిస్తూ 'స్మైల్ ఎమోజీ పెట్టి. ఎప్పుడు' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్ టాపిక్. వీరాభిమానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story