శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ ఫెస్ట్

by Vinod kumar |   ( Updated:2022-03-25 12:33:25.0  )
శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ ఫెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: శేరిలింగంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఫ్యామిలీ ఫెస్ట్ నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాణి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలో విద్యను పెంపొందింప చేయడంతో పాటు వారిలో నైతిక విలువలను పెంపొందింప చేయడానికి ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. వారికి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు.


శ్రీ చైతన్య యాజమాన్యం కేవలం విద్యనే కాకుండా.. పిల్లల్లో నైతిక విలువలను కూడా పెంపొందింప చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం శివరామకృష్ణ, ప్రాంతీయ ఇంఛార్జి అనిత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాణి ప్రసాద్, కో ఆర్డినేటర్ మురళీ కృష్ణ, అకాడమీ డీన్ మురళి, తదితరులు పాల్గొన్నారు.



Advertisement

Next Story

Most Viewed