తెలంగాణలో ఫేక్​ డాక్టర్ల స్కామ్..

by Nagaya |
తెలంగాణలో ఫేక్​ డాక్టర్ల స్కామ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఫేక్​డాక్టర్ల స్కామ్​బయటపడింది. తెలంగాణ మెడికల్​కౌన్సిల్​లో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్​చేసుకొని డాక్టర్లుగా చెలమణి అవుతున్న వారిని సైబర్​క్రైమ్​పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సైబర్​క్రైమ్​కేసులు నమోదు చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. మెడికల్​కౌన్సిల్​లో పనిచేసే ఉద్యోగి ఒక్కోక్కరి నుంచి రూ. 9 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్​చేసినట్లు గురువారం పోలీసులు ప్రకటించారు. ఇలా ఇద్దరి వ్యక్తుల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు వెల్లడించారు. టీఎస్​మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు.

స్కామ్​ జరిగిన తీరు...

కాసరమోని శివానంద్ (32) ఇబ్రహీంపట్నం నివాసీ. ఆయన 2012లో చైనాలోని సౌత్​ఈస్ట్​యూనివర్సిటీలో ఎంబీబీఎస్​ పూర్తి చేసి, ఆగస్టు 2012 ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్​పూర్తి చేసి మన దేశానికి వచ్చే వారికి నిర్వహించే ఎఫ్ఎమ్​జీ పరీక్షలో ఫెయిల్​అయ్యాడు. దీంతో మెడికల్​ కౌన్సిల్​ఉద్యోగి కందుకూరి అనంతకుమార్‌‌తో డీల్​ కుదుర్చుకొని తప్పుడు పత్రాలు సృష్టించి కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యాడు. 2016 డ్యూటీ డాక్టర్‌గా యశోదా సోమాజీగూడలో పనిచేశారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తున్నారు.

తొటా దిలీఫ్​కుమార్​చైనాలోని ననతంగ్​యూనివర్సిటీ లో ఎంబీబీఎస్​పూర్తి చేశారు. ఈయన కూడా ఇండియాలో నిర్వహించే ఎఫ్ఎమ్​జీ పరీక్షలో ఫెయిల్​ అయ్యాడు. కానీ కౌన్సిల్​ఉద్యోగితో డీల్​కుదుర్చుకొని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్​ చేసుకున్నాడు. 2016 నుంచి 2018 వరకు యశోదాలో డ్యూటీ చేశారు. ప్రస్తుతం ఆయన సీనియర్​డాక్టర్​గా ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.

2012, 2014లో ఫెయిల్....

విదేశాల్లో ఎంబీబీఎస్​పూర్తి చేసినోళ్లు ఇండియాలో రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి తప్పనిసరిగా ఎఫ్ఎమ్​జీఈ(ఫారెన్​ మెడికల్​ గ్రాడ్యుయేట్స్​ ఎగ్జామినేషన్​) పాస్​కావాలి. కానీ వీరిద్దరూ 2012, 2014లో రెండు సార్లు ఫెయిల్​ కావడం గమనార్హం. ఎంబీబీఎస్​ చేసే సమయంలోనే శివానంద్, దిలీఫ్‌లు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ గా మారిపోయారు. దీంతో ఇద్దరు కలిసి బ్యాక్​ డోరులో రిజిస్ట్రేషన్​చేసుకున్నట్లు సైబర్​క్రైమ్​పోలీసులు తెలిపారు.

ఇలా దొరికారు...?

ప్రతీ ఐదేళ్లకోసారి డాక్టర్లు మెడికల్​ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వీరిద్దరూ తొలిసారి తెలంగాణ స్టేట్​ మెడికల్​ కౌన్సిల్​ లో రిజిస్టర్​ అయ్యారు. అయితే రెన్యువల్​కు అప్లై చేసుకునే సమయంలో అన్ని వివరాలు సరిగ్గా ఇచ్చి, ఫొటోలను తప్పు ఇచ్చారు. దీంతో తప్పును గుర్తించిన రిజిస్టర్​ సీహెచ్.హనుమంతరావు ఫిబ్రవరి 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుట్టు రట్టు అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed