- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood Drug case :'మత్తు'లో జోగుతుందెవ్వరు.. విచారణకు మళ్లీ సినీ తారలు?
దిశ, తెలంగాణ బ్యూరో: మూడేళ్ల క్రితం సెలబ్రిటీలు, రాజకీయ నేతలను గడగడలాడించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అసలు ఈ కేసును విచారించిన ఎక్సైజ్‌శాఖ.. నిజాలను ఎందుకు దాచిందనేది తేలాల్సిన ప్రశ్నగా మారింది. ఎక్సైజ్ విభాగానికి చెందిన స్పెషల్ఇన్వెస్టిగేషన్టీం (సిట్) సినీ పరిశ్రమకు చెందిన 16 మందికి క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఈ కేసు ముందుకు సాగలేదు. డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొంది. ఓవైపు ఈడీ ఎంటరైన నేపథ్యంలోనే సినీ ప్రముఖులకు క్లీన్చిట్ఇవ్వడంతో.. చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ సందేహాలు తీరలేదు. ఇటీవల పరిణామాల్లో కొంతమంది రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలపై కూడా డ్రగ్స్, పేకాట ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ నివేదిక మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అబ్కారీ శాఖ నివేదికలో రాజకీయ ప్రముఖులు ఉండటంతోనే ఈ కేసును పక్కదారి పట్టించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈడీ కూడా ఎక్సైజ్ శాఖ తీరును తప్పుపట్టింది.
నయా ట్విస్ట్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మొత్తంగా మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో అడిగిన అన్ని వివరాలను ఎక్సైజ్ శాఖ ఇచ్చేసింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలను ఈడీకి అందజేశారు. వివరాలన్నీ అందజేసినట్లు ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం మెమో దాఖలు చేసింది. దీంతో సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఈడీ వెనక్కి తీసుకుంది. డ్రగ్కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఈ నెల 23న ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ ఆరోపించింది. సీఎస్సోమేష్ కుమార్, ఎక్పైజ్ శాఖ కమిషనర్సర్ఫరాజ్కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పిటిషన్‌లో వెల్లడించింది.
మళ్లీ రావాలి
మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. మరోసారి సినీతారల్ని విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈసారి విచారణకు తొలుత హాజరయ్యేది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. డ్రగ్స్ లావాదేవీలు, కొనుగోళ్లు, మనీ లాండరింగ్‌పై ప్రశ్నించనున్నారు.
అనుమానాల కేసు
టాలీవుడ్‌కు డ్రగ్స్ కేసులో అవినీతి మరకలంటాయి. 2017లో ఓ హీరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విశ్లేషించిన తర్వాత డ్రగ్స్ కేసులను బయటకు తీశారు. హీరో రవితేజ నుంచి పూరి జగన్నాథ్, చార్మీ, ముమైత్ ఖాన్‌తో సహా మొత్తం ఇరవై మందికిపైగా టాలీవుడ్ ప్రముఖులను పోలీసులు విచారించారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్లు డ్రగ్స్ వాడారో లేదో తేల్చేస్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నేతృత్వంలోని విచారణ బృందం ప్రకటించింది. దాదాపుగా అందర్నీ విచారించిన తర్వాత కేసు సైలెంటయిపోయింది. ఇదే సమయంలో ఈ కేసు అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార రక్కు చట్టం కింద ఎక్సైజ్‌శాఖకి దరఖాస్తు చేసి వివరాలు సేకరించింది. 2020 సెప్టెంబర్ వరకూ చార్జిషీట్లు దాఖలు చేయలేదని తేలింది.
అనూహ్యంగా ఈడీ ఎంట్రీ ..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం సంచలనం సృష్టించింది. గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్, చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు ఆగస్టు, 2020లో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఓవైపు ఈడీ టాలీవుడ్ సెలబ్రిటీల్ని విచారిస్తూండగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో ఎక్సైజ్ శాఖ చార్జిషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేకమంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది. సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవని, నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. వారినుంచి సేకరించిన శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు డ్రగ్స్ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే గతేడాది సెప్టెంబర్‌లో సినీతారలందిరికీ క్లీన్‌చిట్ ఇచ్చారు.
ఈడీ బయటకు తీస్తుందా?
ప్రస్తుతం ఈడీ చేతికి కీలక ఆధారాలు వెళ్లినట్లైంది. రాజకీయ నేతలు, బడాబాబులు, సినీ తారలను కాపాడేందుకే ఎక్సైజ్‌శాఖ ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. అంతేగాకుండా డ్రగ్స్ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన ఐపీఎస్ అధికారి అకున్సబర్వాల్కూడా అనూహ్యంగా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. దీనిపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు కీలకమైన ఫైళ్లు ఈడీకి ఇవ్వడంతో మళ్లీ విచారణ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అయితే, కెల్విన్చెప్పిన వారందరినీ మళ్లీ విచారణకు పిలుస్తారా అనే అనుమానాలు తొలిగిపోవడం లేదు. కెల్విన్విచారణలో చాలామంది రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల్లోనే ఎక్సైజ్ శాఖ.. ఈడీకి వివరాలన్నీ పంపించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.