- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుసగా ఐదో నెలలోనూ స్తబ్దుగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి!
దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా ఐదో నెలలోనూ మందకొడిగానే నమోదైంది. కరోనా ఒమిక్రాన్ ప్రభావం కారణంగా వస్తువులు, సేవలకు డిమాండ్ తగ్గిపోవడంతో భారత పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) ఈ ఏడాది జనవరిలో 1.3 శాతంతో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. గతేడాది ఇదే నెలలో ఐఐపీ సూచీ 0.6 శాతంగా నమోదైందని జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గనులు, తయారీ రంగాల మెరుగైన పనితీరుతో ఉత్పత్తి కొంతమేర పెరిగింది. సమీక్షించిన నెలలో గనుల రంగం 2.8 శాతం వృద్ధి చెందగా, ఐఐపీలో 77.63 శాతం వాటా ఉన్న తయారీ రంగ ఉత్పత్తి జనవరిలో 1.1 శాతం పెరిగింది. అయితే, విద్యుదుత్పత్తి 2021, జనవరిలో నమోదు చేసిన 5.5 శాతం వృద్ధితో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 0.9 శాతం క్షీణించింది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో ఐఐపీ సూచీ 13.7 శాతంగా ఉందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.