ట్రిపుల్ కెమెరాలతో Samsung Galaxy F23 5G

by Harish |
ట్రిపుల్ కెమెరాలతో Samsung Galaxy F23 5G
X

దిశ, వెబ్‌డెస్క్: Samsung నుంచి Galaxy సిరీస్‌లో కొత్తగా F23 5G మోడల్‌ భారత్‌లో మార్చి 8న లాంచ్ అయింది. ఇది వెనుక ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. Samsung Galaxy F23 5G వాయిస్ ఫోకస్ అనే ఫీచర్‌తో ప్రీలోడ్ చేయబడింది. ఇది కాల్స్ చేసేటప్పుడు పరిసర శబ్దాన్ని తగ్గిండంలో, వాయిస్‌ని పెంచడంలో సహాయపడుతుంది.

Samsung Galaxy F23 5G స్పెసిఫికేషన్స్..

ఈ స్మార్ట్ ఫోన్ Android 12 పై వన్ UI 4.1తో నడుస్తుంది. ఈ ఫోన్‌కు రెండేళ్లపాటు OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందుతాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో 6.6-అంగుళాల పూర్తి-HD+ ఇన్ఫినిటీ-U డిస్ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G SoCతో పాటు గరిష్టంగా 6GB RAM తో వస్తుంది. ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌‌ను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Samsung Galaxy F23 5G 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డు ద్వారా (1TB వరకు) పెంచుకోవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, NFC, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. NFCలో Samsung Pay సపోర్ట్‌ కూడా ఉంది. ఆడియో ప్లేబ్యాక్ కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది.

4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,499. 6GB + 128GB మోడల్ ధర రూ. 18,499. ఫోన్ ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో వస్తుంది. ఈ ఫోన్ Flipkart, Samsung.com ద్వారా మార్చి 16న మధ్యాహ్నం 12 గంటల నుండి దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన రిటైల్ స్టోర్‌లలో విక్రయించబడుతుంది. కొనుగొలు సమయంలో ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లకు రూ. 1,000 క్యాష్‌బ్యాక్, అలాగే రెండు నెలల YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed