వాహనదారులకు అలర్ట్: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు

by GSrikanth |   ( Updated:2022-03-31 00:16:00.0  )
వాహనదారులకు అలర్ట్: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల రూపాయలని తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం మోటారు వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు రావడం జరిగినందున ప్రజల వద్ద నుంచి వచ్చిన స్పందన, విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి మరో పదిహేను రోజుల పాటు ఏప్రిల్ 15 వరకు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని వివరించారు. ఈ-చలాన్ వెబ్సైట్‌లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్లు క్లియర్ చేసుకోవాల్సిందిగా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed