తులా రాశి వారికి ఆరోగ్య సమస్యలు తప్పవా..?

by Nagaya |   ( Updated:2023-10-06 08:47:56.0  )
తులా రాశి వారికి ఆరోగ్య సమస్యలు తప్పవా..?
X

చిత్త 3, 4 (రా, రి); స్వాతి 1, 2, 3, 4 (రూ, రే, రో, తా)

విశాఖ 1, 2, 3 (తీ, తు, తే)

ఆదాయం-8

వ్యయం-8

రాజపూజ్యం-7

అవమానం-1

ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు 13.04.2022 వరకు పంచమమున లోహమూర్తిగాను తదుపరి షష్ఠమందు సువర్ణమూర్తిగాను సంచరించును. శని 29.04.2022 అర్థాష్టమ శనిగా తదుపరి పంచమములో 12.07.2022 వరకు సువర్ణమూర్తియై, తిరిగి చుర్థస్థానమున తామ్రమూర్తిగా 17.01.2023 వరకు, తదుపరి పంచమమందు రజతమూర్తిగా గోచరించును. రాహువు జన్మమందు సప్తమంలో కేతువు సువర్ణమూర్తులుగా సంచరించెదురు.

రాహు-కేతు ప్రభావం వలన అనారోగ్యము నరములు, ఎముకలు, రక్తమునకు సంబంధించిన అవస్థలు ఎదుర్కొనవలసి వచ్చును. వాహనములు నడుపునపుడు తగు జాగ్రత్త అవసరము. స్నేహ ధర్మ కొరకు ఎవరో చేసిన పొరపాటుకు మీరు సంజాయిషీ చెప్పవలసిన పరిస్థితి రావచ్చును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ బాధించవచ్చును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక స్థితి మెరుగుపడవచ్చును. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. ఉద్యోగ సంబంధిత విషయాలలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాలుండవచ్చును. వంశపారంపర్య ఆస్తుల విషయంలో న్యాయం జరగక పోవచ్చు. స్వయంశక్తితో శ్రమకు తగిన ఫలితాలు పొందవచ్చును. వ్యాపార సంబంధమైన విషయాలు, భూ సంబంధిత విషయాలు కలిసి రావచ్చు. యోగా-మెడిటేషన్ వంటివి అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చును. సొంత నిర్ణయాలు తీసుకోకుండా కొన్ని విషయాల్లో పెద్దలు, స్నేహితుల సలహాలను పాటించడం వల్ల కలసి రావచ్చు. శాడిస్టు మనస్తత్వం కలిగిన అధికారుల వల్ల ఇబ్బంది పడవచ్చు. నూతన నిర్ణయాలు తీసుకొని ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తారు. అవసరమైన ఖర్చులు తగ్గించడం వల్ల మేలు జరగవచ్చును. కుటుంబ వ్యవహారాల్లో బంధుమిత్రుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించేస్తారు. సంతాన ప్రాప్తి కలగువచ్చును. కొన్ని వ్యాపార సంబంధమైన వ్యవహారాలకు మీరు నాయకత్వం వహిస్తారు. ఆప్యాయతతో ఆచరించవలసిన వారే మిమ్మల్ని దూరంగా ఉంచవచ్చు. అనాలోచిత చర్యలు తగ్గించడం మంచిది. పోటీ పరీక్షల్లో రెండవ సారి ప్రయత్నాలు కలిసి రావచ్చు. జీవితాశయాన్ని నెరవేర్చుకోవచ్చు. ఆర్థికంగా కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. ఆత్మీయుల కోసం మీపై నిందలు వేసుకుంటారు. దీని కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి కలుగవచ్చును. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు రావచ్చును. కళారంగాల్లో- సాహిత్యరంగంలో మంచి ఫలితాలు ఉండవచ్చును. మనసు విప్పి మాట్లాడడం వల్ల ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. బంధువర్గాల్లో ఇబ్బందిగా మారిన పెళ్లిని పూర్తి చేస్తారు. రావలసిన ధనం వసూలు చేసుకోవడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటారు. ఆర్థిక పరిస్థితి ఒడిదొడుకులతో ఉండవచ్చు. ఎగుమంతి-దిగుమతి వ్యాపారాలు లాభాల బాటలో ఉండవచ్చు. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు వచ్చే అవకాశాలున్నాయి. బంగారు ఆభరణాల భద్రతలో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితుల ఇబ్బందుల విషయాలలో సహాయం చేస్తారు. పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రులు మరియు వారికి సంబంధించిన విషయాల్లో వారికి నచ్చిన విధంగా నడుచుకుంటారు. బంధువులతో ఉద్యోగాల పరంగా అన్యాయం జరగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. రాజకీయపరమైన అంశాలలో సానుకూల అభివృద్ధి కనబరచవచ్చు. ఆరోగ్య సమస్యలపై కాస్త జాగ్రత్త వహించడం మంచిది. మొండికి పడ్డ పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకువస్తారు. ఫైనాన్స్‌కి వ్యాపారం, షేర్లకి దూరంగా ఉండండి. విద్యార్థుల విషయంలో కాలం అనుకూలంగా ఉంది. కోర్టు కేసుల నుంచి క్షేమంగా బయటపడతారు. ఇలాంటి రకమైన ఇబ్బందులు రావడానికి మూడు వంతులు మీ ఆత్మీయవర్గమే కారణం. మీ వల్ల ఇతరులకు మంచి జరుగవచ్చును. వైద్యరంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నవి. విద్యాసంస్థల విషయంలో లాభాలు ఉండవచ్చు. పాల వ్యాపారులకు, పౌల్ట్రీ వ్యాపారులకు, నీళ్ల, శీతలపానీయ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉన్నా అధికారుల వేధింపులు ఉంటాయి. భూమి కొనుగోళ్లు చేసే అవకాశాలున్నాయి. శక్తివంచన లేకుండా శ్రమిస్తారు. గృహంలోనూ, ఆఫీసులోనూ భద్రతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి.


Advertisement

Next Story

Most Viewed