- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్‌కు కోలుకోలేని షాకిచ్చిన మహిళ
దిశ, మానోపాడు/అలంపూర్ : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే టీఆర్ఎస్ పార్టీని తరమాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. అడుగడుగునా టీఆర్ఎస్ పార్టీని ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి విమర్శిస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజల మనుగడ సాగదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే... కేసీఆర్ దొరను తరమాలంటే ప్రజల సహకారం ఉండాలన్నారు. ఆలంపూర్ మండల లింగనవాయి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ రంజాన్ బీ స్వచ్ఛందంగా పాదయాత్రకు సంఘీభావం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ... సర్పంచ్ రంజాన్ బీకి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ఎంతోమంది సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి వ్యక్తులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెడతామని బెదిరించడంతో ముందుకు రావటం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
MLC Kavitha: ఉచిత సంక్షేమ పథకాలపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు