తొలి చెవి సర్జరీ.. 5వేల ఏళ్ల క్రితమే? చెకుముకి బ్లేడ్‌తో ఆపరేషన్

by Javid Pasha |
తొలి చెవి సర్జరీ.. 5వేల ఏళ్ల క్రితమే? చెకుముకి బ్లేడ్‌తో ఆపరేషన్
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం వైద్యరంగంలో మనం చూస్తున్న పురోగతికి వేల సంవత్సరాల కిందటే బీజం పడిందని తెలుస్తోంది. ఎటువంటి సాంకేతికత లేని కాలంలోనే శస్త్ర చికిత్సలు జరిగాయనేందుకు ఆధారాలు లభించాయి. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఓ స్పానిష్ సమాధిలో 5,300 ఏళ్ల నాటి పుర్రెను కనుగొంది. ఈ పుర్రె ఎడమ చెవి కెనాల్ చుట్టూ అనేక కట్ సింబల్స్ కనిపిస్తుండగా.. నొప్పిని తగ్గించేందుకు చెవి చుట్టూ శస్త్రచికిత్స చేసి ఉండవచ్చని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.

ఈ పుర్రె ఒక వృద్ధ మహిళకు సంబంధించినది కాగా.. 2018లో స్పెయిన్‌, రీనోసోలోని డాల్మెన్ ఆఫ్ ఎల్ పెండన్‌లో 100 మందికి పైగా ఇతర మానవ అవశేషాలతో పాటు దీన్ని కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు. అయితే ఈ పుర్రె చెవి వెనుక భాగం ఎముక దగ్గర తలకు రెండు వైపులా రెండు చిల్లులు ఉన్నట్లు గుర్తించారు. చెవి కేంద్రంలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకే ఈ శస్త్రచికిత్సకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా ఈ శస్త్రచికిత్సలు ఏకకాలంలో జరిగియా? లేదా వేరు వేరుగా జరిగాయా? అన్న విషయంపై పరిశోధకుల్లో అనిశ్చితి నెలకొంది. కానీ మానవజాతి చరిత్రలో ఇదే మొట్టమొదటి చెవి సర్జరీ అయ్యుండవచ్చని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. ఆ వృద్ధ మహిళ సమాధిలో దొరికిన చెకుముకి బ్లేడ్‌ను బట్టి, ఎముకను దాంతోనే ముక్కలు చేసినట్లు భావిస్తున్నారు. పైగా ఇది 300 నుంచి 350 డిగ్రీ ఉష్ణోగ్రతల వద్ద అనేక సార్లు వేడెక్కినట్లు, ఖచ్చితంగా ఇదే శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్య పరికరంగా వాడుకలో ఉన్నట్లు అర్థమవుతోంది.



Advertisement

Next Story