ఎస్ ప్రేమలో ఉన్నా.. వాడే నా మొగుడిగా రావాలంటూ శివయ్యకి మొక్కుకున్న యాంకర్ రష్మీ.. హింట్ ఇచ్చేసినట్టేగా

by Kavitha |
ఎస్ ప్రేమలో ఉన్నా.. వాడే నా మొగుడిగా రావాలంటూ శివయ్యకి మొక్కుకున్న యాంకర్ రష్మీ.. హింట్ ఇచ్చేసినట్టేగా
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్(Rashmi Gautam) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించిన ఈ భామ తర్వాత కాలంలో హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అయితే ఆమె ఇంత ఫేమ్ తెచ్చుకోవడానికి కారణం మాత్రం జబర్దస్త్ షో అనే చెప్పాలి. ఇక్కడ సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer)తో రీల్ లవర్‌గా నటించి మెప్పించింది. వీరిద్దరీ జోడి చూస్తే నిజంగానే వీరు రియల్ లైఫ్‌లో కూడా లవర్స్ ఏమో అన్నంత క్యూట్‌గా ఉండేవారు. కానీ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేసి ప్రస్తుతం సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నాడు. అప్పుడప్పుడు బుల్లితెర షోలకు అతిథిగా వస్తూ అలరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రష్మీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కొత్త కొత్త రియాలిటీ షోలు, కార్యక్రమాలతో తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలో ఈటీవీ దూసుకెళ్తోంది. ఈ ఛానెల్‌కు ల్యాండ్ మార్క్ అన్నట్లుగా తయారైన జబర్దస్త్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అన్న గుర్తింపు తెచ్చుకున్న ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company). దాదాపుగా జబర్దస్త్‌లోని స్టాండప్ కమెడియన్లే ఈ షోను నడిపిస్తుండటం కామెడీ టైమింగ్ కూడా బాగుండటంతో ప్రేక్షకులు శ్రీదేవి డ్రామా కంపెనీని బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. కార్తీక పౌర్ణమి కావడంతో దాని బ్యాక్‌డ్రాప్‌లో షోని ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా నీటిలో దీపాలను వదులుతారు లేడీ కంటెస్టెంట్స్.

అప్పుడు రష్మీ.. ఓ మంచి దేవుడా నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడిగా రావాలని చెప్తుంది. ఎవరిని కోరుకున్నావ్? ఎవరు వాడు? అని రాంప్రసాద్(Ram Prasad) అడగ్గా రష్మి సిగ్గు పడుతుంది. ఎలా ఉంటాడో ఒక రెండు పోలికలు చెప్పమని నూకరాజు(Nukaraju) అడగ్గా.. నాకు కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడని రష్మి చెబుతుంది. అంతా కరెక్ట్‌గానే చెప్పారు.. అది గుర్రం కాదు, గోట్(GOAT) ఏమో చూడండి అని ఇంద్రజ(Indraja) సెటైర్లు వేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రష్మిని పెళ్లాడబోయే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే ఫుల్ ఏపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రోమోను చూసిన నెటిజన్లు రష్మీ మనసులో ఉంది సుధీర్ అన్ననే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story