- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏప్రిల్ 1 కోసం ఎదురుచూస్తున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1న నిర్వహించనున్న 'పరీక్షా పే చర్చ'కు వస్తున్న స్పందన పై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే లక్షల మంది ఆసక్తి కనబరిచారని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ ఏడాది పరీక్షా పే చర్చకు వస్తున్న స్పందన అసాధారణమైనది. లక్షల మంది తమ అనుభవాలు, అంతర దృష్టిని పంచుకున్నారు. భాగస్వామ్యమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. ఏప్రిల్ 1 కోసం ఎదురుచూస్తున్నాను' అని ట్వీట్ చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రిత్వ శాఖ పరీక్షా పే చర్చ ఐదవ ఎడిషన్‌ను న్యూఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోడీ విద్యార్థులతో చర్చించనున్నట్లు తెలిపింది. కాగా ప్రభుత్వ ప్రకటన ప్రకారం 15.7 లక్షల మంది విద్యార్థులు రాత పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపింది. పరీక్షా పే చర్చ అధికారిక సంస్థ గా మారుతుందని, దీని ద్వారా ప్రధాన మంత్రి నేరుగా విద్యార్థులతో సంభాషించే అవకాశం కల్పిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.