EPFO ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. వడ్డీరేటు తగ్గింపు

by Harish |   ( Updated:2022-03-12 07:58:03.0  )
EPFO ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. వడ్డీరేటు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్( EPFO) వడ్డీ రేటును 2021-22కి 8.1%గా నిర్ణయించింది. వడ్డీరేటును పెంచుతారని లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులు ఎదురు చూశారు. కానీ EPFO వడ్డీ రేటు మరింతగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 కోసం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ రేటును ఇవ్వనున్నట్లు శనివారం నిర్ణయించింది. 60 మిలియన్లకు పైగా ఖాతాదారులకు ఇది నిరుత్సాహపరిచే నిర్ణయం. గత ఆర్థిక సంవత్సరం 2020-21, 2019-20 లో వడ్డీ రేటు 8.5 శాతం గా ఉంది. క్రితం వడ్డీ రేటుతో పోలిస్తే ఇది తక్కువగా ఉంది.



Advertisement

Next Story