Bigg Boss 8: న‌య‌ని పావ‌ని ఎలిమినేట్‌.. ఆ ప్లేయ‌ర్లు డ‌మ్మీ అంటూ షాకింగ్ కామెంట్స్‌..

by Prasanna |
Bigg Boss 8: న‌య‌ని పావ‌ని ఎలిమినేట్‌.. ఆ ప్లేయ‌ర్లు డ‌మ్మీ  అంటూ షాకింగ్ కామెంట్స్‌..
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఇక, తొమ్మిది వారంలో నయ‌ని పావ‌ని ఎలిమినేట్ అయింది. హ‌రితేజ‌, న‌య‌ని లు ఉండ‌గా.. త‌క్కువ ఓట్లు రావడంతో న‌య‌ని పావ‌ని ఎలిమినేట్ అయిందని నాగ్ చెప్పారు. ఎలిమినేట్ అయిన తర్వాత నయని పావ‌ని స్టేజీ పైకి వ‌చ్చి చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఇప్పుడు ఉన్న వాళ్ల‌లో ముగ్గురు బెస్ట్ అని, మిగతా ఐదుగురు డ‌మ్మీ అని చెప్పింది.

హ‌రితేజ‌, నిఖిల్‌, పృథ్వీల‌ను బెస్ట్ ప్లేయ‌ర్లని, గంగ‌వ్వ‌, రోహిణి, ప్రేర‌ణ‌, గౌత‌మ్‌, విష్ణుప్రియ‌ల‌ను డ‌మ్మీ ప్లేయ‌ర్లని చెప్పింది. గంగ‌వ్వ‌ టాస్క్ లు ఆడలేదు. ప్రేర‌ణ‌కు ఈజీగా కోపం వచ్చేస్తుంది, ఆమె మాట‌ల వ‌ల్ల ఎదుటివాళ్లు హర్ట్ అవుతున్నారని చెప్పింది. విష్ణుప్రియ‌ స్టార్టింగ్ లో టాస్క్ లు బాగానే ఆడింది, అయితే ఈ మధ్య ఆడ‌లేక డ‌మ్మీ ప్లేయ‌ర్‌గా మిగిలి పోయిందని అన్నది. రోహిణి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు అని స‌ల‌హా ఇచ్చింది. ఇక, గౌత‌మ్ గురించి మాట్లాడుతూ.. మనం ఒకరి నుంచి ఏది ఎక్స్ పెక్ట్ చేస్తున్నామో మనం కూడా అదే ఇవ్వాలని స్ట్రాంగ్ గా చెప్పింది.

Advertisement

Next Story