- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకు విద్యుత్ శాఖ షాక్.. ఫ్రీ కరెంట్ కట్..
దిశ, సూర్యాపేట : వారంతా పోలీస్ శాఖకు చెందినవారే.. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన పోలీస్ క్వార్టర్స్‌లో వారి కుటుంబ సభ్యులతో జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగా ఏళ్ల తరబడి ఆ క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు. అయితే విద్యుత్ శాఖ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఎలాంటి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసుకోకుండా.. ఏళ్ల తరబడి ఉచితంగా విద్యుత్తును వినియోగించుకుంటున్నారు. పలుమార్లు పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న వారికి విద్యుత్ శాఖ అధికారులు మీటర్లను ఏర్పాటు చేసుకొని నెలల విద్యుత్ ఛార్జీలను చెల్లించాలని పోలీసులను కోరారు.
అయినా పోలీసులు విద్యుత్ అధికారుల విన్నపం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యుత్‌ను వాడుకుంటున్నారు. దీంతో విసుగు చెందిన విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ క్వార్టర్స్ కు విద్యుత్ ను నిలిపివేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో సుమారుగా 15 పోలీసు కుటుంబాలు కొన్నేళ్ల నుంచి జీవనం సాగిస్తున్నారు. ఏ ఒక్క కుటుంబం కూడా విద్యుత్ మీటర్ ను అమర్చుకోలేదు. దీంతో ప్రతి నెల వేలకొద్ది విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి.
దీంతో విద్యుత్ శాఖ అధికారులు ప్రతి కుటుంబం విద్యుత్ మీటర్లు అమర్చుకొని నెలనెలా బిల్లులు చెల్లించాలని వారిని కోరారు. అది పట్టించుకోకుండా ఉచితంగా విద్యుత్ ను వాడుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యుత్ శాఖ అధికారులు బుధవారం రాత్రి విద్యుత్తు లైన్ కట్ చేశారు. ఈ మేరకు విద్యుత్ అధికారులను వివరణ కోరగా బుధవారం, గురువారం మాత్రమే విద్యుత్ ఇస్తామని, రెండు రోజుల్లో కరెంటు మీటర్లు ఏర్పాటు, బకాయిలు చెల్లించకపోతే శాశ్వతంగా కరెంట్ కట్ చేస్తామని చెప్పారు.