- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Actress Kasturi: నటి కస్తూరికి బిగ్ రిలీఫ్..
దిశ, వెబ్ డెస్క్: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో అరెస్టై.. చెన్నై జైల్లో ఉన్న నటి కస్తూరికి (Actress Kasturi) భారీ ఊరట లభించింది. ఎగ్మూర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అనంతరం.. ఆదివారం ఆమెను ఎగ్మూర్ కోర్టులో(Egmore Court) హాజరు పరచగా.. 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకూ రిమాండ్ (Kasturi Remand) ఇవ్వడంతో.. పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే.. తాను సింగిల్ మదర్ ని అని, తనకు స్పెషల్ చైల్డ్ ఉందని.. ఆ చిన్నారి బాగోగుల్ని తానే చూసుకోవాలని కోర్టుకు విన్నవిస్తూ.. బెయిల్ కోరగా.. కోర్టు కస్తూరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపురం మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళులుగా చెప్పుకుంటున్నారని వ్యాఖ్యలు చేసింది. దీనిపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెన్నైలో కేసులు పెట్టడంతో.. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 29న ఆమెను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.