- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Health Tips: ఖాళీ కడుపుతో నానబెట్టిన గింజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!
దిశ, వెబ్‌డెస్క్: ఉదయాన్నే నానబెట్టిన గింజలు(Soaked nuts) తింటే హెల్త్‌కు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు దట్టంగా ఉంటాయి. అంతేకాకుండా ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే నానబెట్టిన గింజలు తింటే జీర్ణక్రియ సులభమవుతుంది. మెదడు శక్తిని కూడా పెంచడలంలో మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని, జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా చియా గింజల్లో(chia seeds) ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు(Fatty acids), ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. కాగా హెల్త్ కు చాలా మంచివి. అయితే సీడ్స్ ఆరోగ్యానికి మేలే కానీ.. ఖాళీ కడుపుతో తీసుకోవడం శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం..
ఎండుద్రాక్ష మేలు..
ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష(raisins) తీసుకోవడం వల్ల రక్త హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఉదయమే తింటారు కాబట్టి.. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా బ్లడ్ సర్కులేషన్ ను మెరుగుపరుస్తుంది. దీని వల్ల గుండె సమస్యలు(Heart problems) రాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
బరువును తగ్గించే చియా గింజలు
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చియా గింజలు నైట్ నానబెట్టి మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగినట్లైతే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తక్షణ శక్తిని ఇస్తాయి. వెయిట్ లాస్ అవ్వడంలో మేలు చేస్తాయి ఆకలిని చాలా సేపు వరకు నియంత్రణలో ఉంచుతాయి.
గుమ్మడి గింజలు..
రోగనిరోధక శక్తిని పెంచడంలో గుమ్మడి గింజలు(Pumpkin seeds) సూపర్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఈ సీడ్స్‌లో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం(Magnesium) పుష్కలంగా ఉంటాయి. మంచి నిద్రకు గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి. కాగా చాలా మంది గుమ్మడి సీడ్స్ రాత్రి నానబెట్టి మార్నింగ్ తింటుంటారు.
వాల్ నాట్స్ ఉపయోగాలు..
వాల్ నాట్స్(Wall nuts) తింటే శరీరానికి కావాల్సిన కొవ్వులు అందుతాయి. నానబెట్టిన వాల్ నట్స్ లో ప్రోటీన్లు దట్టంగా ఉంటాయి. ఫ్యాట్లు, విటమిన్లు మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ఇవి మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి.
స్మృతికి మేలు చేసే బాదం..
నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదం గొప్ప పోషకాహారంగా పేరు గాంచింది. కాగా ప్రతి రోజూ రాత్రి బాదం(almond) నానబెట్టి తింటే శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందుతాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జుట్టు, స్కిన్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మెంతుల మేలు..
మధుమేహ వ్యాధిగ్రస్తుల(Diabetics
)కు మెంతులు(dill) బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. మెంతులు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాగా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ కంట్రోల్ లో ఉంచుతుంది.
దాహాన్ని తీర్చే సబ్జా గింజలు..
చాలా మంది ఎక్కువగా సబ్జా గింజలు(Sabja seeds) వాటర్ లో వేసుకుని తాగుతుంటారు. దీంతో దాహం తీరుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సమ్మర్ లో ఎక్కువగా సబ్జా సీడ్స్ వాటర్ తాగుతుంటారు. ఈ వాటర్ పేగులోని మలినాలను బయటకు పంపించడంలో ఎంతో తోడ్పడుతాయి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించ గలరు.