యూపీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోడీ

by Disha News Desk |
యూపీ ఎన్నికల ర్యాలీలో  కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోడీ
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మొదటి రౌండ్ ఎన్నికల ఓటింగ్ తర్వాత కుటుంబ పార్టీలకు నిద్ర పట్టట్లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజాస్వామ్యానికి అర్థాన్ని ఈ పార్టీలు మార్చేశాయని చెప్పారు. యూపీలోని కన్నౌజ్‌లో ఎన్నికల ప్రసారంలో శనివారం ఆయన ప్రసంగించారు. కుటుంబం చేత.. కుటుంబ కోసం.. కుటుంబ ప్రభుత్వం అనే నినాదంగా మార్చాయని అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు, మాఫియాకు సరైన విరుగుడు బీజేపీ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుజరాత్‌లో ఉన్న పరిస్థితులే , యూపీలోనూ ఉండేవని ఆయన తెలిపారు. కానీ బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయన్నారు. యూపీలోనూ బీజేపీ అధికారంతో శాంతి భద్రతల సమస్యలు తగ్గాయని చెప్పారు. నేరాలు, అవినీతి ఆధారంగా నడిచే రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని విపక్షాలను ఉద్దేశించి అన్నారు.

కాంగ్రెస్‌ పుకార్లు ప్రచారం చేసింది

పార్లమెంటులో కాంగ్రెస్‌పై మాటల దాడి మరవకముందే మరోసారి ప్రధాని విమర్శలు ఎక్కుపెట్టారు. కరోనా వ్యాప్తిపై కాంగ్రెస్ పుకార్లు ప్రచారం చేసిందని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ పుకార్లు వ్యాప్తి చేసిందని అన్నారు. ముఖ్యంగా దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్‌ను పార్టీ అవమానపరించదని అన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలు ఓట్లతో ఆ పార్టీకి బదులివ్వాలని చెప్పారు. వ్యాక్సిన్ల పట్ల ప్రజల ఆలోచనల్లో భయాన్ని పుట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని అన్నారు. కరోనా సమయంలో తమ ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్‌తో పాటు ఇతర పథకాలతో మద్దతుగా నిలిచిందని చెప్పారు. మహమ్మారి సమయంలో ఏ పేద వారిని ఖాళీ కడుపుతో నిద్ర పోకుండా చూశామని తెలిపారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి తిరుగులేకుండా చేసిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని అన్నారు.

Advertisement

Next Story