- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునిసిపాలిటీపై రూ.50 లక్షల పన్ను.. మంత్రి చెప్పినందుకే..
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దాదాపు రూ.50 లక్షల జరిమానాను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గత కొన్నేళ్లుగా ఢిల్లీ వాయు కాలుష్యంతో సతమవుతోంది. రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే, తాజాగా.. ఢిల్లీ వాతావరణ మంత్రి గోపాల్ రాయ్ రాష్ట్ర కాలుష్య నివారణ కమిటీ (డీపీసీసీ)కి సరికొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేషన్‌కు రూ.50 లక్షల జరిమానా విధించమంటూ మంత్రి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే ఢిల్లీ ఘాజీపూర్ ల్యాండ్ ఫిల్ నుంచి ఇంకా పొగ వెలువడుతూ ఉండటమే అందుకు కారణంగా తెలిపారు. రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తుంటే మున్సిపాలిటీ ఈ పొగ విషయంలో నిర్లక్ష్యం వహించిందని, కాబట్టే మున్సిపాలిటీకి జరిమానా విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా 'ప్రస్తుతం పనిచేస్తున్న మున్సిపాలిటీ ఉద్యోగులపై కూడా యాక్షన్ తీసుకోవాలని డీపీసీసీకి తెలిపాం. ఘాజిపూర్ ఇన్సిడెంట్‌పై వారి వివరణ కూడా కోరాం' అని గోపాల్ తెలిపారు.