డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో డబుల్ అవినీతి: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

by Disha Desk |
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో డబుల్ అవినీతి: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
X

లక్నో: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే డబుల్ అవినీతితో కూడుకున్నదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 'వాళ్ళు కొత్త పార్లమెంటు నిర్మిస్తున్నారని మీరు విన్నారు. అది దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో నిర్మిస్తున్నారు. కొత్త పార్లమెంట్ నిర్మాణం తర్వాత ఎలాంటి రాజ్యాంగం తీసుకువస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా ఆపాలి. వారు రాజ్యాంగాన్ని కూడా ఏమైనా చేస్తారు' అని అన్నారు. బీజేపీ నల్ల చట్టాలతో 700 మందికి పైగా రైతులను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు ప్రతీ బీజేపీ అభ్యర్థి 700 గుంజిలు తీసిన రైతులు వారిని క్షమించరు' అని అన్నారు. ఈ ప్రాంతంలో చౌదరీ ప్రభావంతో దాదాపు 30 సీట్లు గెలిచేలా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రైతు నిరసనలకు వేదిక అని అఖిలేష్ యాదవ్ ఉద్ఘాటించారు.

Advertisement

Next Story