- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Smartphones: స్మార్ట్ ఫోన్ల వినియోగం పిల్లల మానసిక పరిస్థితిపై దెబ్బతీస్తుందా..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జనాలు స్మార్ట్ ఫోన్లకు ఎంతగా బానిస అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పిల్లల నుంచి మొదలుకొని పెద్దలు కూడా అదే పనిగా ఉపయోగిస్తున్నారు. పెద్దలు స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమై.. తాము చేసే పని కూడా మర్చిపోతున్నారు. ప్రజెంట్ డేస్‌లో చిన్నపిల్లలు తిండి తినకున్నా.. అదే స్మార్ట్ మొబైల్ చూపించి ఫుడ్ తినిపిస్తున్నారు.
ఏడ్చినా ఫోన్ చూపిస్తున్నారు. కానీ ఈ మొబైల్ వాడకం వారి భవిష్యత్తులో అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుందని నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా యువతైతే.. పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. తిండి లేకున్నా ఉండగలుగుతారేమో గానీ ఒక్క పూట మొబైల్ లేకుండా మాత్రం శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
అయితే మొబైల్స్ కు బానిసైన చిన్నారుల్లో కోపం, చిరాకు, ఆందోళన వంటివి పెరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. పిల్లల్లో మొబైల్ వాడకం కోపాన్ని పెంచుతుందా? మానసికంగా దెబ్బతీస్తుందా..? అనే ప్రశ్నపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్మార్ట్‌ఫోన్ వినియోగం కలిగించే దుష్ప్రభావం ఈ అధ్యయనంలో ప్రాథమికంగా స్మార్ట్‌ఫోన్ మానసిక ఆరోగ్యానికి, ఆందోళనకరమైన స్వభావం కలగడాన్ని ఇంటర్నెట్ వినియోగదారులు మెదడు హెల్త్ పై జరిపిన గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ అనే అధ్యయనంలో వెల్లడైంది.
సాధారణంగా 10 సంవత్సరాల వయస్సులోపున్న పిల్లలతో, కొద్దిగా పెద్ద వయస్సులో (తొలి 13-17 సంవత్సరాలు) వారితో పోలిస్తే భావోద్వేగ, మానసిక సవాళ్లలో చాలా ఎక్కువ స్థాయి మార్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మగాళ్లలో కంటే ఆడపిల్లల్లోనే 65 శాతం మానసిక సమస్యలు ఎక్కువ తలెత్తుతున్నట్లు వెల్లడించారు. కోపం, చిరాకు కూడా కారణం మొబైల్ అధికంగా వాడటమేనని గుర్తించారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.