Lemon: శీతాకాలంలో నిమ్మరసం తాగితే కోల్డ్ అవుతుందా.. ఇందులో నిజమెంత..?

by Anjali |
Lemon: శీతాకాలంలో నిమ్మరసం తాగితే కోల్డ్ అవుతుందా.. ఇందులో నిజమెంత..?
X

దిశ, వెబ్‌డెస్క్: నిమ్మకాయ రసం(lemon juice) ఉపయోగాలు బోలెడు. మనకి తెలియని అనేక బెనిఫిట్స్ నిమ్మలో దాగి ఉన్నాయి. ఆకలిని తగ్గించడంలో మేలు చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ(digestion)కు మెరుగుపరిచే శక్తి కూడా దీనిలో ఉంది. బరువు తగ్గడానికి(weight loss) నిమ్మకాయ రసం ఎంతో సహాయపడుతుంది. లెమన్ డైరెక్ట్‌గా ఫ్యాట్(Fat) తగ్గడానికి కారణం కానప్పటికీ, అవి వివిధ మార్గాల్లో బరువు తగ్గుదలకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతుంటారు. అలాగే నిమ్మ శరీరానికి చలువ చేస్తుంది. అయితే శీతాకాలంలో నిమ్మరసం తాగితే కోల్డ్ అవుతుందని అనేక మంచి భావన. మరీ ఎంత వరకు వాస్తవం. అధ్యయనం ఏం చెబుతోంది. ఓసారి చూద్దాం..

నిమ్మకాయలో విటమిన్ సి(Vitamin C) పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటి పవర్(Immunity power) ను అందించడంలో మేలు చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలపడి ఇన్ఫెక్షన్లు అండ్ కోల్డ్ నుంచి కాపాడుతుంది. కానీ చలికాలంలో లెమన్ రసం తాగితే జలుబు(cold) చేస్తుందని అనుకోవడంలో ఏమాత్రం నిజం లేదని.. ఎక్కడ ఎటువంటి నిరూపణ కూడా లేదని తాజాగా నిపుణులు వెల్లడించారు. కానీ శీతాకాలంలో నిమ్మరసం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాతావరణ చల్లగా ఉన్నప్పుడు కూలింగ్ వాటర్ లో నిమ్మకాయ రసం కలుపుకుని తాగొద్దని సూచిస్తున్నారు. అలాగే చాక్లెట్(Chocolate), పాలు(milk) వంటి పదార్థాలతో కలిపి తీసుకోవద్దు. దీంతో శరీరానికి పోషకాలు అందవు. కాగా గోరువెచ్చటి వాటర్‌లో నిమ్మరసం మిక్స్ చేసుకుని తాగండి. గొంతు సమస్యలు(Throat problems) దూరం అవుతాయి. అలాగే జలుబు కాకుండా ఉంటుంది.

నిమ్మలో విటమిన్ సి అండ్ యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగిస్తాయి. నిమ్మ రసం బాడీలోని ట్యాక్సిన్ల(toxins)ను తొలగిస్తుంది. కాలేయం ఫంక్షన్(Liver function) పనితీరును మెరుగుపర్చడమే కాకుండా.. జీర్ణ సంబంధ ప్రాబ్లమ్స్ కు చెక్ పెడుతోంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

అలాగే గ్యాస్ట్రిక్ రీస్టోరేషన్(Gastric restoration) కోసం సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. హాట్ వాటర్లో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. మానసిక ఒత్తిడి(mental stress)ని తగ్గిస్తుంది. తలలోని వెంట్రుకల కుదుళ్లను కూడా క్లీన్ చేసి హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని(Heart health) మెరుగుపరుస్తుంది. నిమ్మలోని యాంటిఆక్సిడెంట్లు క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. రక్తపోటు(blood pressure)ను నియంత్రిస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed