- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో నిరుద్యోగులుగా మారనున్న వైద్యులు !?
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజాజీవనం ఇబ్బందులు ఎదుర్కొంది. వైరస్ బారిన పడి వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే, కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్యులు చేసిన సేవ అంతా ఇంతా కాదు. వందలాది మంది వైద్యులు మూడు వేవ్‌లలో పీపీఈ కిట్లు ధరించి రేయింబవళ్లు శ్రమించి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి వేలాది మందిని కాపాడారు. అయితే, ఇంత కష్టపడిన వైద్యులు మార్చి 31 తర్వాత నిరుద్యోగులుగా మారనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం దాదాపు 250 మంది వైద్యులను కాంట్రాక్లు ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోగా.. వీరి కాంట్రాక్టు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై వైద్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్టును పొడగిస్తుందా? లేక అందరిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్స్ (TJUDA), హెల్త్‌కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్స్ (HRDA) రాష్ట్ర ఆరోగ్య శాఖకు పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా, తెలంగాణ ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఫిబ్రవరి 9, 2020న 656 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 120 మంది సివిల్ సర్వెంట్ సర్జన్లు రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో పనిచేసేందుకు రిక్రూట్ చేయగా.. వీరు మార్చి 31, 2023 వరకు కొనసాగనున్నారు.