భారత తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఎవరో తెలుసా?

by Manoj |
భారత తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఎవరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: భారత తొలి స్వాతంత్య్ర సమర యోధుడు మంగళ్ పాండే 1827 జులై 19న జన్మించారు. ఉత్తర్ ప్రదేశ్‌‌కు చెందిన ఆయన 9 ఏళ్ల వయస్సులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ 34వ బెంగాల్ రెజిమెంట్‌లో సిపాయిగా విధులు నిర్వర్తించాడు. అద్వితీయ ప్రతిభతో అనతికాలంలోనే సైనిక దళ నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. ఈ క్రమంలోనే 1857 సిపాయిల తిరుగుబాటులో భాగంగా కోల్‌కతాలోని బారక్‌పూర్ వద్ద బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. ఈ మేరకు సుమారు రెండు శతాబ్ధాల బానిసత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్య్ర సమర యోధుడిగా మంగళ్ పాండే చరిత్ర సృష్టించాడు.

అప్పటివరకు బ్రిటిషర్ల పెత్తనానికి తలొగ్గి.. వారి అరాచకాలు, అవమానాలను మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేకే దక్కింది. ఈయన చరిత్రను ఆధారంగా చేసుకుని 2005లో 'మంగళ్ పాండే' అనే హిందీ సినిమా తెరకెక్కించగా.. ఈ యోధుడి గౌరవార్థం భారత ప్రభుత్వం 1984 అక్టోబరు 5న తపాలా బిళ్లను విడుదల చేయడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed