మా ప్రాణాలు పోయినా.. భూములు వదలం

by Mahesh |   ( Updated:2022-03-19 11:48:11.0  )
మా ప్రాణాలు పోయినా.. భూములు వదలం
X

దిశ, కాగజ్నగర్: పోడు భూముల రైతుల సమస్య కాగజ్నగర్ మండలం లో కొనసాగుతుంది. భూములు చదును చేసేందుకు వచ్చిన అటవీ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని కడాంబ గ్రామంలో రైతుల పోడు భూములను చదును చేయడానికి వచ్చిన అటవీ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. గత నెలలో మండలంలోని వూట్ పల్లి లో పోడు రైతులు, మహిళలు గ్రామంలో నిర్వహించిన అటవి భూములు వన్యప్రాణుల సంరక్షణ సదస్సులో బీట్ అధికారి శిరీష ను నిలదీసి, దాడి చేయడంతో పలువురు రైతులపై కేసులు నమోదయ్యాయి.

నెలరోజులు గడవకముందే మళ్ళీ కదంబ గ్రామంలో సుమారు 70 ఎకరాల్లో 25 మంది రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను చదును చేయడానికి ట్రాక్టర్లతో అధికారులు శనివారం కదంబ గ్రామం చేరుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు, మహిళలు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. 30 సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్నామని.. తమ ప్రాణాలు పోయిన భూములు వదిలేది లేదని వారు కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో అటవీ అధికారి శివ కుమార్ గ్రామస్తులకు ఈ భూముల గురించి వివరించారు.

ఒ దశలో గ్రామస్తులపై అధికారి శివ కుమార్ దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించినట్లు పలువురు యువ రైతులు వాపోయారు. ఈ భూములు అటవీ శాఖకు చెందినవిగా పేర్కొన్నారు. ఈ భూముల్లో రైతులు సాగు చేస్తున్నందున భూములలో వేసిన పత్తి, కంది తదితర పంటలు తొలగించి చదును చేసేందుకు ట్రాక్టర్లను తీసుకువచ్చినట్లు ఎఫ్ ఆర్ ఓ కె శివ కుమార్ తెలిపారు. ముందస్తుగా అటవీ అధికారులు పోలీసుల సహాయం కోరడంతో కాగజ్నగర్ రూరల్ సీఐ రాజేంద్ర ప్రసాద్, ఈస్ గావ్ ఎస్ఐ రాకేష్ పోలీస్ బందోబస్తు తో అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారం రోజులుగా భూమి సమస్యను అధికారులతో కలిసి పరిష్కరించుకోవాలని రైతులకు సీఐ సూచించారు.

Advertisement

Next Story