- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. టెట్‌లో నిజామాబాద్ జిల్లా సెంటర్
దిశ, నవీపేట్ : టెట్ పరీక్ష దరఖాస్తులలో నిజామాబాద్ సెంటర్ లేకపోవడాన్ని 'టెట్ అభ్యర్థుల కష్టాలు' అని దిశ వెబ్ లో వచ్చిన కథనానికి విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించి, నిజామాబాద్ సెంటర్ ఆప్షన్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం నుండి టెట్ అప్లికేషన్ లో నిజామాబాద్ జిల్లా లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. గత్యంతరం లేక పక్క జిల్లా లైన కామారెడ్డి, నిర్మల్ లను ఎంపిక చేసుకున్నారు. బుధవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు సహితం లేకపోవడంతో చాలా మంది అభ్యర్థులు సంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపిక చేసుకున్నారు.
నిజామాబాద్ సెంటర్ లేకపోవడంతో టెట్ అభ్యర్థుల ఆవేదనను ''దిశ వెబ్'' లో ప్రచురించడంతో స్పందించిన ఉన్నతాధికారులు.. గురువారం నుంచి నిజామాబాద్ జిల్లాను టెట్ సెంటర్ గా ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మంగళవారం, బుధవారం నాడు ఇతర జిల్లాలను ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు నిజామాబాద్ సెంటర్‌కు మారేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం గమనార్హం.