- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఐకాన్' స్టార్‌గా ఎనర్జిటిక్ హీరో.. బన్ని నుంచి రామ్‌కి
దిశ, వెబ్‌డెస్క్: వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్‌తో 'ఐకాన్' సినిమా చేయాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గాడు. ఎందుకంటే అతను ఇప్పటికే ఇచ్చిన కమిట్‌మెంట్‌లతో చాలా బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ పుష్ప సీక్వెన్స్ సుకుమార్‌తో తియ్యడానిక సిద్ధింగా ఉన్నాడు. కాగా పుష్ప పార్ట్ వన్ ఇప్పటికే బాలీవుడ్‌ను సైతం షేక్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పుడు వేణు శ్రీరామ్ తన సినిమా కోసం రామ్ పోతినేనిని సంప్రదించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ది వారియర్ సినిమా కోసం డైరెక్టర్ లింగుస్వామితో కలిసి రామ్ పనిచేస్తున్నాడు. తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బోయపాటి శ్రీనుతో జతకట్టనున్నాడు. అంతా సవ్యంగా జరిగితే రామ్‌కు 'ఐకాన్' చేసే చాన్స్ రావోచ్చు. దిల్ రాజు, రామ్ హోమ్ బ్యానర్ ఇద్దరూ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రాపో మాస్, కమర్షియల్ చిత్రాలకు సైన్ చేయడంలో రామ్ బిజీగా ఉన్నాడు. కమర్షియల్ స్టార్‌గా తనను తాను నిలబెట్టుకుంటూ హీరో సెంట్రిక్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ఇవి కూడా అతనికి బాగానే కలిసి వస్తున్నాయి.