డైరెక్టర్ శ్రీను వైట్ల విడాకులు.. ఆ హీరోయిన్ మోజులో పడేనా ?

by samatah |
డైరెక్టర్ శ్రీను వైట్ల విడాకులు.. ఆ హీరోయిన్ మోజులో పడేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు సంబంధిచిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే శ్రీను వైట్ల, రూప వైట్ల విడిపోవడానికి రెడీ అయ్యారంట. గత కొన్ని రోజుల నుంచి విడి విడిగా ఉంటున్న వీరు.. విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు శ్రీను వైట్ల తీసిన ఏ మూవీ అయినా సరే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేటే చేసేది. తన సినిమా చేయాడనికి ఎంతో మంది స్టార్ హీరోస్ ఎదురు చూసేవారు. ఈ యన దర్శకత్వంలో వచ్చిన వెంకీ, దూకుడు, ఢీ లాంటి ఎన్నో సినిమాల మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలపై ఎక్కు ఆసక్తి చూపడం లేదు. గత కొద్దికాలం నుండి ఆయనకు సరైన హిట్టు పడకపోవడంతో ఇండస్ట్రీలో కొంచెం వెనుకడుగు వేస్తున్నాడు. ఇక ఆయన సినీ ఇండస్ట్రీలో వెనుకడుగు వేసినట్టే తన వైవాహిక జీవితంలో కూడా పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య తనకు విడాకులవ్వడానికి సిద్ధమైనట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

శ్రీను వైట్ల సో కాల్డ్ హీరోయి హీరోయిన్‌తో సంబంధం పెట్టుకున్నాడని, అందువలన తన కుటుంబంపై కూడా ఎక్కువ ఆసక్తి చూపట్లేదని, దీంతో నాలుగేళ్లగా తన భార్య కూడా అతనికి దూరం ఉన్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీను వైట్ల భార్య రూపావైట్లతో నాంపల్లి కోర్టు లో విడాకులు తీసుకోవడానికి పిటిషన్ వేసినట్లు ఒక వార్త బాగా హల్చల్ చేస్తోంది. కానీ విడాకులు తీసుకోవడానికి శ్రీను వైట్ల ఒప్పుకోవడం లేదన్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారికంగా ఏలాంటి సమాచారం లేదు.

Advertisement

Next Story

Most Viewed