Naga Chaitanya: ‘తండేల్’ విడుదల అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. సంక్రాంతికి సిద్ధమంటూ కామెంట్స్ (వీడియో)

by Hamsa |
Naga Chaitanya: ‘తండేల్’ విడుదల అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. సంక్రాంతికి సిద్ధమంటూ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’(Thandel). అయితే ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించగా.. అల్లు అరవింద్(Allu Arvind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Rock Star Devisree Prasad)సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ‘తండేల్’(Thandel) ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti) ‘తండేల్’ అప్డేట్ ఇచ్చారు. ‘‘మా సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయింది. జనవరిలో విడుదల చేసేందుకు మేము రెడీగా ఉన్నాము. ఇంకా పది రోజులు షూట్ చేస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ రామ్ చరణ్(Ram Charan) మూవీ వస్తుందని అల్లు అరవింద్, వెంకీ మామ(Venkatesh) చిత్రం వస్తుందని నాగచైతన్య(Naga Chaitanya) ఆలోచిస్తే మాత్రం సంక్రాంతి నుంచి ‘తండేల్’(Thandel) తప్పుకోవాల్సి ఉంటుంది. జనవరి 26న విడుదల చేద్దామనుకుంటే ఆదివారం కాబట్టి ఆ అవకాశం లేదు. సంక్రాంతి కంటే ముందే రిలీజ్ చేయాలంటే సినిమా పనులు పూర్తి కావు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ చందూ మొండేటికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story