- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
48 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు(2021, ఏప్రిల్ నుంచి 2022, మార్చి 16 వరకు) రూ. 13.63 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మొత్తం రూ. 9.18 లక్షల కోట్ల వసూళ్లు జరిగాయి. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48 శాతం వృద్ధి సాధించగా, ముందస్తు పన్ను చెల్లింపులు 41 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ముందస్తు పన్ను వసూళ్లు మొత్తం రూ. 6.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు రకాల కరోనా వైరస్ వేరియంట్లను ఎదుర్కొన్న తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తాజా గణాంకాలు సాక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1.87 లక్షల కోట్ల రీఫండ్ జారీ చేసినట్లు ప్రభుత్వం వివరించింది. మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రూ. 7.19 లక్షల కోట్లు(53 శాతం) కార్పొరేట్ పన్నులు ఉండగా, రూ. 6.40 లక్షల కోట్లతో(47 శాతం) వ్యక్తిగత ఆదాయ పన్నుల నుంచి వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించడం, కరోనా టీకా పురోగతి, కొత్త కేసులను ఎదుర్కోవడం వంటి పలు చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదపడ్డాయని ప్రభుత్వం తెలిపింది.