- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రధాని మోడీ ఆధ్వర్యంలో నిరంకుశ పాలన: శత్రఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు
by Harish |
X
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై టీఎంసీ నేత, వెటరన్ నటుడు శత్రఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నిరంకుశ పాలనలో దేశంలో ఇంధన, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారు. అటల్ బిహర్ వాజ్‌పేయి హయాంలో ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. కానీ, మోడీ హయాంలో మాత్రం నిరంకుశత్వం రాజ్యమేలుతుందని విమర్శించారు. 'గర్వం, అహంకారం తప్పుడు స్థానాల్లో ఉన్నాయి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. తొమ్మిది రోజుల్లో 8 సార్లు ధరలు పెరిగాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా?' అని ప్రశ్నించారు. కాగా, ఈ మధ్యనే టీఎంసీలో చేరిన సిన్హా వచ్చే నెల 12న పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ స్థానంలో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు. అంతేకాకుండా వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
Advertisement
Next Story